యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు రేపిస్టులను పోలీసులు భోపాల్ పట్టణ వీధుల్లో బహిరంగంగా పరేడ్ చేయించారు. 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని మహారాణా ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు అదేరోజు నిందితులను అదుపులోకి తీసుకుని పట్టణ వీధుల్లో తిప్పారు.