ఏపీ రాజధానిని అందరి అంగీకారంతోనే నిర్మించాలని మాజీ సీఎఎస్ ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్ చేశారు. ఏక పక్షంగా నిర్మించిన రాజధానులు విజయవంతం కాలేదని హెచ్చరించారు. రాజధానులు మహానగరాలుగా ఉండాల్సిన అవసరం లేదని, మహానగరమే అవసరమనుకుంటే విశాఖను ఎంపిక చేసి ఉండాల్సిందని అన్నారు