సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. రేపు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరతానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తల సూచల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.