మసూద్‌పై తక్షణం చర్యలు తీసుకోండి | Evidence of Pulwama attack hatched on Pakistani soil by JeM | Sakshi
Sakshi News home page

మసూద్‌పై తక్షణం చర్యలు తీసుకోండి

Feb 28 2019 11:40 AM | Updated on Mar 22 2024 11:16 AM

భారత్‌తో యుద్ధానికి కాలుదువ్వుతోన్న పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ శాంతి చర్చలకు సిద్ధమని పేర్కొన్న సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లభిస్తే పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పలు ఆధారాలను భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అందజేసింది. 40 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్‌ అధినేత మసూద్‌ అజహర్‌ మాట్లాడిన టేపులను పాక్‌ అధికారులకు పంపించింది.

Advertisement
 
Advertisement
Advertisement