బస్సు ప్రయాణికులకు భయానక అనుభవం ఎదురైంది. దూకొచ్చిన గజరాజు దాడితో ప్రాణాలు పోయినంత పనైంది. అయితే కొందరి సమయ స్ఫూర్తితో ప్రయాణికులంతా అంతా క్షేమంగా బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం కర్ణాటక చామరాజనగర్ నుంచి కేరళలోని కోలికట్‌కు కేరళ ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తోంది. బస్సు బందీపూర్ అటవీ ప్రాంతానికి చేరుకోగానే ఓ ఏనుగుల మంద వారి కంటపడింది. అయినప్పటికీ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కాస్త ముందుకు పోనిచ్చాడు. ఆ శబ్ధానికి మందలోని ఓ ఏనుగుకు చిర్రెత్తుకొచ్చి బస్సు వైపుగా దూసుకొచ్చింది.