దేశానికి పట్టుగొమ్మలైన గ్రామాలను మరింతగా అభివృద్ధిచేయడమే తమ లక్ష్యమని ప్రధానమంత్రి నరరేంద్ర మోదీ చెప్పారు. గ్రామీణభారతం పంటపొలాలు కళకళలాడుతూ, సేద్యం చేసే రైతు ముఖంలో చిరునవ్వులు చిందించేలా చేయడమే అంతిమ గమ్యమన్నారు. సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి కూడా చక్కటి జీవితాన్ని అందిస్తామని, అందుకే ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ నినాదంతో బడ్జెట్ తీసుకొచ్చామని తెలిపారు. పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ సమర్పణ పూర్తయిన కొద్దిసేపటికే ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.