ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం | Earthquake Shakes Southern Philippines | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌ను వణికించిన భారీ భూకంపం

Dec 15 2019 8:02 PM | Updated on Mar 20 2024 5:39 PM

దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఆదివారం  భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. ఫిలిప్పీన్స్‌ దక్షిణ భాగంలోని మిండనావ్‌ ద్వీపంలో  ఈ భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. దక్షిణ భాగంలో పెద్ద నగరమైన దావావో‍కు 90 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైందని, అయితే సునామీ వచ్చే సూచనలేమీ లేవని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే స్పష్టంచేసింది. ప్రకంపనల ధాటికి  పడాడా నగరం భారీగా దెబ్బతింది.  కాగా భూకంపం సంభవించినప్పుడు ఆరేళ్ల చిన్నారి ఇంట్లో ఉండిపోయింది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement