డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో రవితేజకు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జీశాన్‌తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘మీ సోదరులతో మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్, జీశాన్ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్‌తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. మీ రక్త నమూనాలు తీసుకోవచ్చా?.’ అంటూ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం.