ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ అవిశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రజలను మరోసారి మోసం చేసుందుకు కుట్ర చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం.. అంతా ఓ డ్రామా!. ప్రజలు వాళ్లకి సరైన బుద్ధి చెప్తారు’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు.