విజయవాడలో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి భూమికి తప్పుడు పత్రాలు సృష్టించి 5 ఎకరాల భూమిని కబ్జా చేసిన టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ భూ కబ్జా బాగోతం మరిచిపోకముందే.. మరో భూబాగోతం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలం కబ్జాకు గురైంది. దీంతో భూకబ్జాకు నిరసనగా మంగళవారం కాలేజీ విద్యార్థులు నిరసనకు దిగారు. అక్రమణకు గురైన స్థలంలోని వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.