‘మీరు దళితులు.. మీకెందుకు రా.. రాజకీయాలు’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా దళితులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దళిత, ప్రజా సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయితో మండిపడ్డాయి. ఎక్కడికక్కడ ధర్నాలు, అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాయి. చింతమనేని దిష్టిబొమ్మలకు శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. చింతమనేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.