పక్షవాతంతో బాదపడుతున్న ఓ బాలుడి పట్ల పుల్వామా ఉగ్రదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇక్బాల్ సింగ్ అనే జవాన్ ఔదార్యం చాటాడు. అతనికి తన లంచ్ బాక్స్ ఇవ్వడంతో పాటు స్వయంగా ఆహారం తినిపించాడు. శ్రీనగర్‌లోని నవాకాదల్ ప్రాంతంలో శాంతిభద్రతల పర్యవేక్షణ విధులు నిర్వర్తిస్తున్న ఇక్బాల్‌కు స్థానికంగా నివాసముంటున్న ఓ పిల్లాడు తారసపడ్డాడు. అతను ఆకలితో ఉన్నాడని గ్రహించిన జవాన్ తన లంచ్ బాక్స్ ఇచ్చాడు. అయితే, సదరు బాలుడి రెండు చేతుల్లో చలనం లేదని తెలియడంతో .. తనే దగ్గరుండి తినిపించాడు.