నెలన్నరపాటు సుదీర్ఘంగా కసరత్తు చేసి ఎట్టకేలకు కాంగ్రెస్ తన అభ్యర్థుల తొలి జాబితాను వెల్లడించింది. 65 మంది పేర్లతో సోమవారం రాత్రి 11.15 గంటలకు జాబితా ప్రకటించింది. 119 స్థానాల్లో 26 స్థానాలు మిత్రపక్షాలకు పోను కాంగ్రెస్ పోటీ చేసే 93 స్థానాల్లో 74 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 8న అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే, ఆ జాబితా వెల్లడి కాకుండానే వాటిపై అనేక ఫిర్యాదులు అందడంతో పార్టీ అధ్యక్షుడు రాహుల్ స్వయంగా జోక్యం చేసుకుని సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ భక్త చరణ్‌దాస్, ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, బోసు రాజు, శ్రీనివాసన్‌లతో రాహుల్ రెండు విడతలుగా సమావేశమయ్యారు.