ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం | Sakshi
Sakshi News home page

ప్రజల తెలంగాణను ఆవిష్కరిస్తాం

Published Tue, Mar 13 2018 7:32 AM

ప్రజలు కోరుకున్న తెలంగాణను ఆవిష్కరించేందుకు రాజకీయంగా ముందుకు వస్తున్నామని టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. కోదండ రాం నేతృత్వంలో ఏర్పాటయ్యే కొత్త పార్టీలో పనిచేస్తామంటూ మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌తోపాటు పలువురు అనుచరులు సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. దిలీప్‌ తన అనుచరులనుకోదండరాం కు పరిచయం చేశారు.