కారంపొడితో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి దిగాడు ఓ దుండగుడు. సాక్షాత్తూ సచివాలయంలోనే ఈ దాడి జరిగింది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. అనిల్ కుమార్ అనే వ్యక్తి సిగరేట్ ప్యాకెట్‌లో కారం పొడి నింపుకొని సచివాలయంలోకి దూసుకొచ్చారు. భోజనం సమయం కావడంతో ముఖ్యమంత్రి తన గదిలో నుంచి బయటికి వస్తుండగా ఆయనపై కారంపొడి చల్లాడు.