మొసళ్ల అంటే ఎంత భయం.. చూస్తేనే ఒళ్లు గగుల్పొడుస్తుంది. అలాంటిది అది పక్కన ఉండగా భోజనం ఎలా చేస్తం.. భయంతో చచ్చిపోతాం. కానీ చైనాలోని ఓ రెస్టారెంట్‌లో ఎంచక్కా దానితో సెల్ఫీ దిగవచ్చు.. ఆడుకోవచ్చు. రెస్టారెంట్‌కు కస్టమర్లను రప్పించాలని వినూత్నంగా ఆలోచించిన ఓ యజమాని ఏకంగా మొసలిని పెంపుడు జంతువులా పెంచుతున్నాడు. ఇక ఈ రెస్టారెంట్‌కు వచ్చిన యువత డిన్నర్ అనంతరం తెగ ముచ్చటపడుతూ మొసలితో సెల్పీలు తీసుకుంటున్నారు. చిన్న పిల్లలైతే పెంపుడు జంతువులతో ఆడుకుంటున్నట్లు ఆడుకుంటున్నారు. అయితే ఈ హోటల్ నిర్వాహుకులపై కొందరు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. మొసలిని చూడాలంటే జూపార్క్‌లకు వెళ్లాలి. కానీ రెస్టారెంట్‌లో పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఈ హోటల్లో మొసలితో ఆడుకోవచ్చు..
Oct 6 2017 3:05 PM | Updated on Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement