వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేపట్టిన సంఘీభావ యాత్ర ముగిసింది. ఐదవరోజు సింహాచలం సమీపంలోని ప్రహ్లాద పురం నుంచి మర్రిపాలం వరకూ పాదయాత్ర సాగింది. అనంతరం ఊర్వశి జంక్షన్‌లో ప్రజలను ఉద్ధేశించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం స్పష్టం చేశారని గుర్తు చేశారు.