నంద్యాలలో న్యాయం గెలిచిందని వైఎస్‌ఆర్ సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ విష ప్రచారం చేసిందని ఆయన మండిపడ్డారు. కాగా టీడీపీ ఎన్ని అభ్యంతరాలు, కుట్రలు చేసినప్పటికీ శిల్పా మోహన్ రెడ్డి నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ... స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కుట్రలను ప్రోత్సహిస్తున్నారు. బూత్‌ల వారీగా మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రలోభాలకు గురి చేస్తూ కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారని మండిపడ్డారు.