పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో తీవ్ర అవినీతి జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిధి పార్థసారధి ధ్వజమెత్తారు. టెండర్ల పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల పేరుతో దోచుకునేందుకు చంద్రబాబు దోపిడీ యజ్ఞానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. చంద్రబాబుకు పోలవరం బంగారు బాతుగా మారిందని పార్థసారధి వ్యాఖ్యానించారు. అంచనాలను విపరీతంగా పెంచి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. కేంద్రం కూడా ఇదే విషయాన్ని చెబుతోందన్నారు.