ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయి | Chandrababu must go to Jail in Cash for Vote Scam Says Bhumana Karunakar Reddy | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబే ముద్దాయి

May 9 2018 12:08 PM | Updated on Mar 22 2024 11:07 AM

ఓటుకు కోట్లు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే ముద్దాయి అని దేశమంతా నమ్ముతోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. ఫోన్‌లో మాట్లాడిన వాయిస్ టేపు రికార్డులో ఉన్న గొంతు చంద్రబాబుదే అన్నది స్పష్టమైందని తెలిపారు. చంద్రబాబును అప్పుడే అరెస్ట్ చేయాల్సి ఉండే, కానీ ఇలా తప్పుడు పనులు చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోక పోవడం వల్ల చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు ఉండటం వల్లే ప్రజాస్వామ్యంపై విశ్వాసం సన్నగిల్లుతోందని మండిపడ్డారు.

హైదరాబాద్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీబీఐ విచారణకు తెలంగాన పోలీసులు చేపట్టిన విచారణ అడ్డుకారాదని పేర్కొన్నారు. ఓటు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన దొంగ చంద్రబాబు అని, ఛార్జిషీటులో ఆయన పేరు ఇంతవరకూ ఎందుకు చేర్చలేదని భూమన ప్రశ్నించారు. ఇందులో తెలంగాణ సీఎం కేసీఆర్ నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు పేరు చేర్చకుంటే వారు కూడా చట్ట వ్యతిరేకులే అన్నారు. సామాన్యుడైనా, సీఎం అయినా చట్టాలు ఒకే తీరుగా ఉంటాయని, దీన్ని అందరూ సమ్మతిస్తారని చెప్పారు. అయినా ఏళ్లు గడుస్తున్నా కోట్లు ఖర్చుపెట్టి ఎమ్మెల్యేల ఓట్లు కొనేందుకు చూసి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబును విచారణకు పిలవకపోవడం దారుణమన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement