ఐదేళ్ల పాలనతో దేశ పటంలో రాష్ట్ర రాజధాని అడ్రస్ కూడా లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతుండడం హేయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి లేక వలసపోయిన భవన నిర్మాణ కార్మికుల గురించి ఒక్కరోజైనా మాట్లాడని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ రాద్ధాంతం చేయడం శోచనీయమన్నారు. బొత్స సత్యనారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా వైభోగం అనుభవించిన సుజనా చౌదరి రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు తోకలా వంతపాడటం అనైతికమని పేర్కొన్నారు.
బాబు ఒక్క ఇల్లయినా ఇచ్చారా?
Nov 6 2019 8:09 AM | Updated on Mar 22 2024 10:57 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement