రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం చేసే దగా, మోసపూరిత రాజకీయాలకు హైకోర్టు విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న యూటర్న్ నిదర్శనమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హైకోర్టు కావాలని ఇన్ని రోజులు కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి చుట్టూ తిరిగిన టీడీపీ ఎంపీలు ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించడం తగదన్నారు.