కాంగ్రెస్‌ ఆంధ్రుల గొంతు కోసింది.. | BJP committed to implement Agenda of AP Reorganisation Act | Sakshi
Sakshi News home page

Feb 10 2018 2:01 PM | Updated on Mar 21 2024 10:58 AM

విభజన చట్టంలోని హామీల అమలుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..బీజేపీపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం కమిటీ ఏర్పాటు చేశామని పోలవరం నిర్మాణానికి రూ.4వేల కోట్లు విడుదల చేసినట్లు జీవీఎల్‌ నరసింహరావు తెలిపారు. కడప స్టీల్‌ప్లాంట్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, దుగరాజపట్నం పోర్టుపై అభ్యంతరాలను పరిశీలిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రుల గొంతు కోసిందని, రాష్ట్రానికి కాంగ్రెస్‌ సరైన న్యాయం చేయలేదని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి కేంద్రం సాయం చేసిందన్నారు.  రాజకీయ లబ్దికోసం దుష్ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement