అయోధ్య భూ వివాదం కేసు కీలకమైన మలుపు తీసుకుంది. కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు లలిత్ తప్పుకున్నారు. గురువారం అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన 14 పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణను జనవరి 29కి ధర్మాసనం వాయిదా వేసింది. అనంతరం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. జస్టిస్ లలిత్ గతంలో కల్యాణ్ సింగ్ తరుపున అయోధ్య కేసు వాదించారు.
ఈనెల 29న అయోధ్య కేసు విచారణ
Jan 10 2019 11:41 AM | Updated on Mar 20 2024 3:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement