చర్చలు విఫలం..ఆర్టీసీలో సమ్మె సైరన్‌ | APSRTC union calls off strike | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం..ఆర్టీసీలో సమ్మె సైరన్‌

Jan 23 2019 7:35 AM | Updated on Mar 22 2024 11:10 AM

రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో(ఏపీఎస్‌ఆర్టీసీ) సమ్మె సైరన్‌ మోగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెకు సై అంటున్నారు. సమ్మె తేదీలను బుధవారం ప్రకటిం చాలని నిర్ణయించారు. మంగళవారం విజయవాడలో ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు, ఈడీలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సమ్మెకు సిద్ధమవు తున్నామని చర్చల అనంతరం ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, పలిశెట్టి దామోదరరావు మీడియాకు తెలియచేశారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement