గ్రామ వలంటీర్లకు గురువారం నుంచి ప్రతి మండలంలోనూ ఇంటర్వూ్యలు ప్రారంభం కాబోతున్నాయి. ఇంటర్వూ్యలలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను వివరించేందుకు పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజా శంకర్ మంగళవారం మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొత్తం 1,81,885 వలంటీర్ల నియామకానికి గానూ 7,92,334 మంది దరఖాస్తు చేసుకున్నారు.