అగ్రవర్ణాల్లో పేదల కోసం ఎవరు ఊహించని విధంగా రిజర్వేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టారని మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి అన్నారు. అగ్రవర్ణాల్లో పేదల కోసం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడం హర్షణీయమన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి స్కీమ్‌ను ఒక స్కామ్‌గా చంద్రబాబు మార్చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలు నీతి నిజాయితీతో కూడిన పాలన కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు కట్టినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.