ప్రకాశం జిల్లాలో హోమ్‌గార్డు దారుణ హత్య | Andhra Pradesh woman ties lover to cot, sets him afire | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో హోమ్‌గార్డు దారుణ హత్య

Jul 30 2018 9:47 AM | Updated on Mar 20 2024 1:45 PM

వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడిని నమ్మించి మంచానికి కట్టేసి ప్రియురాలు కిరోసిన్‌ పోసి హత్య చేసిన ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన షేక్‌ షబ్బీర్‌ (32) మర్రిపూడి పోలీసుస్టేషన్‌లో హోమ్‌గార్డుగా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా విధులకు హాజరు కావడం లేదు. ఈ నేపథ్యంలో షబ్బీర్‌కు పొదిలి పట్టణానికి చెందిన షకీరా అలియాస్‌ ఇమాంబీతో పరిచయం ఏర్పడింది. కొన్ని నెలలుగా వారిద్దరూ కలిసి కొనకనమిట్ల మండలం చవటపల్లి, పేరారెడ్డిపల్లిలో ఉన్న కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement