నేపాల్‌లో జోరుగా ఎద్దుల పోట్లాట! | Ancient bull fighting festival in Nepal | Sakshi
Sakshi News home page

Jan 16 2018 11:27 AM | Updated on Mar 21 2024 6:13 PM

 పొరుగుదేశం నేపాల్‌లోనూ పండుగ సందడి నెలకొంది. చంద్రమాన క్యాలెండర్‌ పదోనెల ‘మాఘ్‌’  ప్రారంభోత్సవం సందర్భంగా నేపాల్‌ అంతటా మోలాసెస్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇక, కఠ్మాండుకు 75 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య నెలకొన్న నువాకోట్‌ జిల్లాలో ఈ పండుగ సందర్భంగా ప్రత్యేక సంప్రదాయ క్రీడలు జరుగుతున్నాయి. మన దగ్గర కోళ్ల పందేలు జరిగినట్టే.. ఇక్కడ కోడెద్దుల పందేం జరుగుతుంది. మధించిన ఎద్దుల మధ్య పోరాటాన్ని నిర్వహించడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఎద్దుల పోరాటానికి 225 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏడాది హోరాహోరీగా జరిగే ఈ బుల్‌ఫైటింగ్‌ను చూసేందుకు చుట్టుపక్కల జిల్లాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement