వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సోమవారం ఉదయం ప్రముఖ నటుడు జీవితా రాజశేఖర్ దంపతులు కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఈ భేటీ జరిగింది. అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ...‘చాలా రోజుల తర్వాత వైఎస్ జగన్‌ను కలిశాను. మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయి. అప్పట్లో నేను అపరిపక్వతతో ప్రవర్తించాను.