ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ | Aarogyasri Services Stopped In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

Jan 2 2019 10:44 AM | Updated on Mar 22 2024 11:16 AM

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో నిన్నటి(మంగళవారం) నుంచి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులు వైద్య సేవలను నిలపివేశాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌  ఆస్పత్రులకు ప్రభుత్వం 550 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంలో 3 నెలలుగా ఆశా ప్రతినిధులు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ దాదాపు 80వేల రోగుల క్లెయిమ్‌లను పెండింగ్‌లో పెట్టింది. ఆరోగ్యశ్రీ బిల్లులను నెల రోజుల్లో చెల్లిస్తామని చెప్పిన మంత్రులు, అధికారులు పట్టించుకోవడం మానేశారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement