Watch Live: అనకాపల్లిలో సీఎం జగన్ ఏమన్నాడంటే.. | Sakshi
Sakshi News home page

Watch Live: అనకాపల్లిలో సీఎం జగన్ ఏమన్నాడంటే..

Published Thu, Mar 7 2024 11:12 AM

పిసినికాడ, అనకాపల్లి జిల్లా

వరుసగా నాలుగో ఏడాది వైయస్సార్ చేయూత నిధులు బటన్ నొక్కి విడుదల చేసిన సందర్భంగా బహిరంగ సభలో సీఎం శ్రీ వైయస్ జగన్ కామెంట్స్

  • ఈ చిక్కటి చిరునవ్వుల మధ్య నా అక్కచెల్లెమ్మల ప్రేమానురాగాలు, ఆప్యాయతల మధ్య ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతున్నాం.
  • అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముందు రోజున నా అక్కచెల్లెమ్మల ఆత్మగౌరవానికి, ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ ఈ 58 నెలల పరిపాలనలో ప్రతి అడుగూ నా అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఈరోజు ఆ అడుగుల్లో భాగంగా వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని మీ అందరిక సమక్షంలో అనకాపల్లి నుంచి శ్రీకారం చుడుతున్నాం.
  • భారతదేశ చరిత్రలోనే, ఉన్న 28 రాష్ట్రాల్లో అక్కచెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ది చూపించిన ప్రభుత్వం దేశంలోనే  ఎక్కడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడుతున్నా.
  • మహిళా పక్షపాత ప్రభుత్వంగా, ఆ పదానికి అర్థం చెబుతూ ఈ 58 నెలల పాలన తర్వాత వైయస్సార్ చేయూత కార్యక్రమం 4వ విడత నిధుల్ని 45-60 సంవత్సరాల మధ్య వయసున్న నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అక్కచెల్లెమ్మలకు అందించే ఈ కార్యక్రమానికి మరో 14 రోజులపాటు ఒక పండుగ వాతావరణంలో ప్రజా ప్రతినిధులందరూ పాలు పంచుకుంటూ అక్కచెల్లెమ్మలకు మంచి చేసే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది.
  • ఈ కార్యక్రమంలో అక్కచెల్లెమ్మలకు జరిగిన మంచి, వారి జీవితాలు ఎలా బాగుపడ్డాయి అన్న కథలు ప్రతి సచివాలయంలో, ప్రతి మండలంలో ప్రతి ఒక్కరూ చర్చించుకొనేలా, స్పూర్తిదాయకమయ్యేలా పండుగ వాతావరణంలో ప్రతి అక్కచెల్లెమ్మ మైకు పట్టుకుని మాట్లాడాలని కోరుతున్నా.
  • గతంలో ఏ ప్రభుత్వం కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు.
  • 45 ఏళ్లు పైబడిన నా అక్కచెల్లెమ్మలు ఎలా బతుకుతున్నారు, వారి కుటుంబాలు ఎలా బతుకుతున్నాయి, వారికి తోడుగా, అండగా ఉండేందుకు ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన కూడా గత ప్రభుత్వాలు చేయలేదు.
  • ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. 45-60 మధ్య వయసున్న నా అక్కచెల్లెమ్మల చేతుల్లో ఏ డబ్బు పెట్టినా కూడా ఆ కుటుంబాలన్నీ బాగుపడతాయని మనస్పూర్తిగా వారి గురించి ఆలోచన చేసి, అదే అక్కచెల్లెమ్మలను చేయి పట్టుకుని నడిపిస్తూ క్రమం తప్పకుండా ప్రతి ఏటా రూ.18750 చేతిలో పెడుతూ, నాలుగేళ్లలో ఏకంగా 75000 ఆర్థిక సాయం నా అక్కచెల్లెమ్మలకు చేస్తానని మాట ఇచ్చాను.
  • ఇదే జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో ఇదే చేయూత అనే కార్యక్రమం గురించి చెప్పా. ఈరోజు చెప్పిన ఆ మాటను నెరవేర్చుకుంటూ మొత్తం నాలుగో విడత కూడా 75 వేలుగా ఇచ్చే కార్యక్రమానికి ఇదే అనకాపల్లి జిల్లాలోనే చేస్తున్నామని చెప్పడానికి సంతోషపడుతున్నా.
  • ప్రతి అక్కచెల్లెమ్మకూ క్రమం తప్పకుండా సాయం చేస్తూ, బ్యాంకులతో రుణాలు ఇప్పిస్తూ, మల్టీ నేషనల్ కంపెనీలతో తోడ్పాటునిస్తూ, ఏకంగా 1.69 లక్షల మంది కిరాణా షాపులు అక్కచెల్లెమ్మలు పెట్టుకుని నడుపుతున్నారు.
  • 85630 మంది చెల్లెమ్మలు వస్త్రవ్యాపారం, 3,80,466 మంది అక్కచెల్లెమ్మలు గేదెలు, ఆవులు కొన్నారు.
  • 1,34,514 మంది అక్కచెల్లెమ్మలు మేకలు కొన్నారు.
  • 88,923 మంది అక్కచెల్లెమ్మలు ఫుడ్ ప్రాడక్ట్స్ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నారు.
  • 3,98,422 మంది అక్కచెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ వ్యాపారాలు చేస్తున్నారు.
  • మరో 2,59,997 మంది అక్కచెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఇంటిని కూడా నడుపుతున్నారంటే అక్షరాలా 16.55,991 మంది అక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ప్రతి అక్కచెల్లెమ్మ కనీసం రూ.6-10 వేలు సంపాదించుకుంటూ చిక్కటి చిరునవ్వులతో తాను బతుకుతూ, తన కుటుంబానికీ తోడుగా ఉందంటే మార్పు ఒకసారి గమనించాలి.
  • వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగో విడతగా ఈరోజు 22,98,931 మంది నా అక్కచెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు ఈరోజు నుంచి మరో 14 రోజులపాటు పండుగ వాతావరణంలో మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తున్నాడు.
  • దీంతో నా అక్కచెల్లెమ్మలకు ఒక్క వైయస్సార్ చేయూత ద్వారా ఏకంగా 75000 పెట్టినట్లయింది.
  • వైయస్సార్ చేయూత అనే ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్కచెల్లెమ్మలకు మొత్తంగా రూ.19,189 కోట్లు నేరుగా ఖాతాల్లోకి పంపించినట్లయింది.
  • ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్తున్నాయి.
  • నా అక్కచెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా, మంచి అన్నగా దేవుడు నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుడికి రుణపడి ఉంటాను.
  • ఈ చేయూత పథకం ద్వారా మొత్తం 33,14,906 మంది నా అక్కచెల్లెమ్మలకు ప్రయోజనం పొందితే, వారిలో నవరత్నాల పథకాల ద్వారా ఇదే అక్కచెల్లెమ్మలు మరో రూ.29,588 వేల కోట్లు లబ్ధి పొందారు.
  • ఇదే అక్కచెల్లెమ్మలు వారి కుటుంబాల ఖాతాలు కూడా చూస్తే మరో రూ.56,188 కోట్లు కూడా మంచి జరిగింది.
  • ప్రతి అడుగూ కూడా మీ బిడ్డ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వంగా, నా అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉండాలి, వాళ్ల కుటుంబాలకు మంచి జరగాలని ఈ 58 నెలల కాలంలో ఆలోచన చేస్తూ విద్యాపరంగా, ఆర్థికపరంగా, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, జెండర్ పరంగా, నా అక్కచెల్లెమ్మల భద్రతపరంగా వారందరి సాధికారత లక్ష్యంగా గొప్పగా అడుగులు వేశాం.
  • గతంలో ఎప్పుడైనా ఇలా మంచి జరిగిందా? అని ప్రతి అక్కచెల్లెమ్మ, వారి కుటుంబాలు, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.
  • నా అక్కచెల్లెమ్మలు బాగుండాలని రాజకీయ సాధికారత కల్పిస్తూ, నామినేషన్ పోస్టులు, కాంట్రాక్టులు, 50 శాతం చట్టం చేసి మరీ అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
  • గత ప్రభుత్వానికి అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేయాలని మనసే లేదు.
  • చరిత్రలో తొలిసారిగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా చదివించే తల్లులకు ప్రోత్సాహకరంగా పిల్లలను బడులకు పంపిస్తే చాలు మంచి మేనమామగా, అక్కచెల్లెమ్మలకు మంచి అన్నగా, తమ్ముడిగా స్కూళ్ల రూపురేఖలు మీ బిడ్డ మారుస్తాడు. అమ్మ ఒడి అనే పథకం తీసుకొచ్చి ఏకంగా 53 లక్షల మంది తల్లులకు ప్రతి ఏటా రూ.15,000 ఇస్తూ అండగా నిలబడిన ప్రభుత్వం.
  • ఇలా చదువులను ప్రోత్సహిస్తూ అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. రాష్ట్రంలో ఎక్కడా చూసిందీ లేదు. కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిన మార్పు.
  • గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు ఇలాంటి మేలు చేసిన చరిత్రే లేదు.
  • గతంలో ఎన్నడూ జరగని విధంగా అక్కచెల్లెమ్మలకు పూర్తి ఫీజులు కడుతూ, పిల్లల చదువులు ఇబ్బంది పడకూడదు, పెద్ద చదువులు చదవాలని, ఏ తల్లీదండ్రీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు.
  • పిల్లల తలరాతలు మారుతాయనే ఆలోచన చేసి జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజురీయింబర్స్ మెంట్, జగనన్న వసతి దీవెనమొదలు కల్యాణమస్తు, షాదీ తోఫా వరకు ప్రతి పథకంలోనూ నా అక్కచెల్లెమ్మల పిల్లలు బాగా చదవాలని, ప్రోత్సహిస్తూ ప్రతి రూపాయినీ అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకే నేరుగా జమ చేస్తూ తోడుగా నిలబడ్డ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదు.
  • దేశంలో ఎక్కడా జరగని విధంగా, ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ  ప్రభుత్వంలో మాత్రమే జరుగుతోంది.
  • వైయస్సార్ ఆసరా ద్వారా, వైయస్సార్ సున్నావడ్డీ ద్వారా పొదుపు సంఘాలకు మళ్లీ ఊపిరి పోశాం
  • గతంలో పొదుపు సంఘాలన్నీ కుదేలైపోయి, ఎన్ పీఏలు, ఔట్ స్టాండింగులుగా 18 శాతం చిన్నాభిన్నమైపోయిన పరిస్థితి నుంచి పొదుపు సంఘాలకు ఊపిరి పోశాం.
  • అక్కచెల్లెమ్మలు తమ కాళ్లమీద తాము నిలబడేట్టు చేసి ఇప్పుడు ఏకంగా 99.83 శాతం రుణాల రికవరీతో దేశంలోనే మన అక్కచెల్లెమ్మల పొదుపు సంఘాలు నంబర్ 1లో ఉన్నాయి.
  • గత ప్రభుత్వం అక్కచెల్లెమ్మలకు మోసం చేసిన చరిత్రే ఉంటే, మన ప్రభుత్వం ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ప్రతి అడుగులో నిలిచిన చరిత్ర మనది.
  • గతానికి, ఇప్పటికి తేడా చూడమని మిమ్మల్ని కోరుతున్నా.
  • గతంలో ఎన్నడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా? ఆలోచన చేయాలి.
  • వైయస్సార్ చేయూత ద్వారా 45-60 సంవత్సరాల మధ్య వయసున్న ఏకంగా 33 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలకు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నామైనార్టీలంటూ తోడుగా ఉంటూ ఆర్థిక పటిష్టతకు ఏకంగా 19,190 కోట్లు సహాయం అందించిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం.
  • గతంలో ఎప్పుడైనా ఇలాంటి పనులు జరిగాయా?
  • 45-60 సంవత్సరాల మధ్య వయసున్న కాపు అక్కచెల్లెమ్మలు, ఈబీసీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.15000 ఇస్తూ, వారి ఆర్థిక పటిష్టతకు తోడ్పాటు ఇస్తున్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.
  • గత చంద్రబాబు ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు ఇలాంటి స్కీమే లేదు.
  • సొంతిల్లు లేని పేదింటి అక్కచెల్లెమ్మల పేరుమీద కేవలం ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు అందజేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే.
  • అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విశేషం.
  • చంద్రబాబు ప్రభుత్వంలో ఇలా ఇళ్ల స్థలాలుగా కనీసం ఒక్కరికంటే ఒక్కరికైనా ఒక్క సెంటైనా ఒక్క అక్కచెల్లెమ్మకైనా ఇచ్చాడా అంటే... ఇచ్చింది సున్నా. కట్టింది అరకొర ఇళ్లు.
  • చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా తొలిసారిగా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం భద్రత విషయంలో ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో ఓ మహిళా పోలీసును, నా అక్కచెల్లెమ్మలకోసం నియమించాం.
  • ప్రతి అక్కచెల్లెమ్మల ఫోన్లో ఒక దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు.. ఇలా వ్యవస్థ నెలకొల్పింది మీ బిడ్డ ప్రభుత్వమే.
  • 1.30 కోట్ల అక్కచెల్లెమ్మలు వాళ్ల ఫోన్లలో దిశ యాప్ ఉంది.
  • ఏ అక్కచెల్లెమ్మకైనా ఏ ఆపద వచ్చినా ఫోన్లో ఎస్వోఎస్ బటన్ నొక్కినా, షేక్ చేసినా 10 నిమిషాల్లో ఫోన్ వస్తుంది, పోలీస్ సోదరుడు వచ్చి తోడుగా నిలబడే వ్యవస్థ వచ్చింది కూడా ఈ 58 నెలల్లోనే, మీ బిడ్డ ప్రభుత్వంలోనే.
  • ఇలా ఆపదలో ఉన్న 35 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఈ 58 నెలల కాలంలో పోలీసులు వచ్చి తోడుగా నిలబడినందువల్ల మంచి జరిగింది.
  • గ్రామ గ్రామంలోనూ కూడా ప్రతి వార్డులోనూ కూడా సేవా సారథులుగా మన సచివాలయాల్లోగానీ, మన వాలంటీర్ వ్యవస్థ గానీ, ఇలా ఏ వ్యవస్థ తీసుకున్నా అందులో ఏకంగా 50 శాతం చదువుకున్న మన ఇరుగుపొరుగు చెల్లెమ్మలే.
  • గతంలో ప్రభుత్వ పథకాలు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా అందే పరిస్థితి ఉంటుందని 58 నెలల కిందట మీకు ఎవరైనా చెబితే నమ్మి ఉండేవారా?
  • ఈరోజు నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరిగిస్తూ, ఏకంగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, రూ.2.65 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి అందింది.
  • గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?
  • మీ కుటుంబ సభ్యులతో మీరంతా బ్యాంకులకు వెళ్లండి. బ్యాంకు మేనేజర్లను 10 సంవత్సరాల మీ స్టేట్మెంట్ ఇవ్వమని అడగండి. 5 సంవత్సరాల చంద్రబాబు పాలన, 5 సంవత్సరాల మీ బిడ్డ పాలన.
  • బ్యాంకు స్టేట్మెంట్లు చూసినప్పుడు చంద్రబాబు 5 సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంటుకు వచ్చింది ఒక్కరూపాయి అయినా కనిపిస్తుందా?
  • అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంటులోకి వచ్చిందో మీరే గమనించండి.
  • ఎప్పుడూ జరగని మార్పు, ఎప్పుడూ చూడని విషయాలు ఈ 58 నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తోంది.
  • లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్రరాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి.
  • మహిళా సాధికారత పరంగా, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీనీ మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేశాం.
  • ఎన్నికలప్పుడు మాట ఇవ్వడం, ఒక మేనిఫెస్టో అని రంగురంగుల కాగితాలు చూపించడం, ఎన్నికలయ్యాక చెత్తబుట్టలో పడేసే పరిస్థితిని మార్చి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ ఏకంగా 99 శాతం హామీలను అమలు చేసి అక్కచెల్లెమ్మల కుటుంబాలకు చూపించి ఆశీస్సులు కోరుతున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందంటే మీ బిడ్డ ప్రభుత్వం మాత్రమే.
  • మరోవంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు, దత్తపుత్రుడు.. వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది?
  • చంద్రబాబు పేరు చెబితే మూడుసార్లు సీఎంగా, అక్కచెల్లెమ్మలకు చేసిన మోసాలు, వంచనలు గుర్తుకొస్తాయి.
  • పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది. విశ్వసనీయతలేని చంద్రబాబు గుర్తుకొస్తాడు.
  • మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కళంకం. ఓ మాయని మచ్చగా గుర్తుకొస్తాయి. కార్లు మార్చినట్లు భార్యలను మార్చేది, ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది.
  • వీరిద్దరూ కలిసి ఇంటింటికీ పంచిన, వీరిద్దరి ఫొటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టోఅని చెప్పి 2014లో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలిచ్చారో ఒకసారి గుర్తుకుచేసుకుందామా?
  • రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతో రద్దు చేస్తామన్నారు.
  • అక్కచెల్లెమ్మలు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా విడిపిస్తాం అని వాగ్దానాలు చేశాంరు.
  • టీవీల్లో అడ్వటైజ్ మెంట్ వచ్చేది. ఒక చెయ్యి వచ్చి తాళిబొట్టు లాగేసేవారు, ఇంకో చేయి వచ్చి పట్టుకుని బాబొస్తున్నాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడని అడ్వటైజ్ మెంట్ ఇచ్చారు.
  • ప్రతి ఇంటికీ ఏటా 12 గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు 100 చొప్పున సంవత్సరానికి 1200, 5 సంవత్సరాల్లో 6 వేల సబ్సిడీ ఇస్తామని 2014లో ఇద్దరూ కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పారు.
  • మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని వాగ్దానంచేశారు.
  • ఆడ బిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు బ్యాంకు డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికో పేరు కూడా పెట్టారు. మహాలక్ష్మి అని అమ్మవారి పేరు పెట్టారు. మొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు.
  • పండంటి బిడ్డ అనే పథకం, పేద గర్భిణీ స్త్రీలకు 10 వేలు ఇస్తామని చెప్పారు.
  • ఇవన్నీ 2014లో వీరిద్దరూ కలిసి చెప్పినవి.
  • బడికి వెళ్లే ప్రతి ఆడపిల్లలకు సైకిళ్లు, ప్రతి అక్కచెల్లెమ్మకూ స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు కుటీర లక్ష్మి అని వాగ్దానం చేశారు.
  • ఇవన్నీ ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఫొటోలు పెట్టి సంతకాలు పెట్టి ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు.
  • 2014 ఎన్నికల ముందు ఇచ్చిన ఈ వాగ్దానాల్లో ఏ ఒక్క వాగ్దానామైనా కూడా ఈ బాబు, దత్తపుత్రుడు అమలు చేశారా? అని అడుగుతున్నా?
  • ఇద్దరూ కలిసి 2014లో మేనిఫెస్టోలో ఇవన్నీ చెప్పి అక్కచెల్లెమ్మలు నమ్మిన వారిని నట్టేట ముంచి, ఒక్క రూపాయి కూడా పొదుపుసంఘాల రుణాలు తీర్చకుండా చంద్రబాబు దత్తపుత్రుడు ఎగ్గొట్టారు.
  • అక్కచెల్లెమ్మలను అప్పులపాలు చేశారు. అప్పటిదాకా అమల్లో ఉన్న సున్నావడ్డీ పథకాన్ని సైతం అక్టోబర్ 2016 నుంచి రద్దు చేశారు.
  • బ్యాంకుల్లో పెట్టిన బంగారం బాబు విడిపిస్తాడని నమ్మి డబ్బు కట్టని వారి బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తుంటే ఇదే చంద్రబాబు చోద్యం చూస్తూ నిలబడ్డాడు తప్ప ఆదుకోవాలని మనసు రాలేదు.
  • గ్యాస్ సిలిండర్ల మీద నెలకు ఐదేళ్లూ కలిసి రూ.6 వేలు సబ్సిడీ అన్న వీరు.. అక్కచెల్లెమ్మలకు ఒక్క రూపాయి కూడా సబ్సిడీ మీద ఇచ్చిన పుణ్యం కట్టుకోలేదు.
  • ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేయకపోగా, విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్లు నడిపించి వీరి జాయింట్ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల జీవితాలను ఛిన్నాబిన్నం చేసింది.
  • ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.25 వేలు డిపాజిట్ చేసిన వీరు.. మీలో ఏ ఒక్కరికైనా, మీకు తెలిసిన ఏ ఒక్కరికైనా కనీసం ఆడబిడ్డ పుడితే ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా?
  • ఇలాంటి అబద్దాలు, ఇలాంటి మోసాలతో చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేది మోసం, మోసం, దగా, దగా.
  • చివరకు అమ్మవారి పేరును కూడా ఆటవస్తువుల్లా ఉపయోగించుకున్నారు.
  • అమ్మవారి పేరు పెట్టి వాగ్దానాలు చేసి మోసం చేసిన వీరు మళ్లీ ఆ మోసాన్ని కొనసాగిస్తూ ఈరోజు మహాశక్తి అని మోసానికి తెరతీస్తున్నారు.
  • బిడ్డ పుడితే ఇస్తానన్నది ఒక మోసం, గర్భిణీ తల్లులకు చేసిన వాగ్దానం ఇంకో మోసం, బడికి వెళ్లే ఆడపిల్లలకు చేసిన వాగ్దానం మరో మోసం, ఇల్లాలికి ఇస్తానన్న సిలిండర్ల సబ్సిడీ సైతం ఇంకో మోసం, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు చేస్తానన్న రుణ మాఫీ దారుణమైన మోసం.
  • బెల్ట్ షాపులు రద్దు చేస్తామని ఎక్కడ పడితే అక్కడ ప్రోత్సహించడం ఇంకో దుర్మార్గమైన మోసం, అవ్వలకు సైతం ఓట్ల కోసం చివరి రెండు నెలలు మాత్రమే పెన్షన్ పెంచి చేయాలనుకున్నది ఇంకో గజ మోసం.
  • పెన్షన్ కూడా 4 సంవత్సరాల 10 నెలలు ఇచ్చింది వెయ్యి. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే 2 వేలు ఇచ్చేశాం అని ఎక్కడ పడితే అక్కడ ఊదరగొడుతున్నారు.
  • కడుపులో ఉన్న బిడ్డ మొదలు, పెద్ద వయసులో ఉన్న అవ్వల వరకు అక్కచెల్లెమ్మలందరికీ వీరు చేసిన మోసం, దగా ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి.
  • మళ్లీ అక్కచెల్లెమ్మలకు ఇంటింటికీ ఇంత ఇస్తామని, బీసీ అక్కచెల్లెమ్మలకైతే ఇంకా ఎక్కువ ఇస్తామని, మళ్లీ కొత్త అబద్ధాలు, కొత్త మోసాలు. ఇవి మళ్లీ మొదలయ్యాయి.
  • ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తుకొస్తారు.
  • ఇదే బాబు ఇదే దత్తపుత్రుడు 2014లో బీసీలకు ఏకంగా 143 వాగ్దానాలు చేశారు. చేసింది మాత్రం ఏకంగా ఒక పెద్ద సున్నా.
  • సామాజిక వర్గాలుగానీ, అక్కచెల్లెమ్మల్లో ఏ ఒక్కరైనా వీరిని నమ్మడం అంటే కాటేసే పామును,తినేసే పులిని ఇంటికి తెచ్చుకోవడమే అన్నది ప్రతి అక్కచెల్లెమ్మ ఆలోచన చేయాలి.
  • పలాన మంచి చేశా కాబట్టి, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాం కాబట్టి, ఇదే మంచి మరోసారి చేస్తాం అని ఓట్లు అడిగే పరిస్థితి వీరిద్దరికీ లేదు.
  • చంద్రబాబు పేరు చెప్పినా, ఆయన పాలన గుర్తుకొచ్చినా ఎక్కడా కూడా ఆయన పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచీ లేదు.
  • రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమం మహిళా పక్షపాత ప్రభుత్వంగా ఈ 58 నెలల్లో ఏం చేశామో మీ అందరి ముందూ ఉంచడం జరిగింది.
  • ఇదీ మీ ప్రభుత్వం అన్నది ఎప్పుడూ గుర్తుపెట్టుకోమని అడుగుతున్నా.
  • ఈ ప్రభుత్వం అక్కచెల్లెమ్మల కోసం, మంచి చేయడం కోసం మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోమని కోరుతున్నా.
  • రాబోయే రోజుల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ఎన్ని మోసాలు చేసినా అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి.
  • మరో నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకొచ్చి కేజీ బంగారం, ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామని చెబుతారు.
  • దత్తపుత్రుడు సంతకం పెట్టిన పేపర్ మీ దగ్గరకొస్తుంది.
  • చంద్రబాబు దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి పోజులు ఇస్తూ మేనిఫెస్టో మీ ఇంటికి పంపిస్తారు.
  • ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు మంచి చేస్తారు, ఎవరు మాట మీద నిలబడతారు, ఎవరికి విశ్వసనీయత ఉంది అన్నది మాత్రం మర్చిపోవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నా.
  • మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 58 నెలల కాలంలో మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంది అనుకుంటే మాత్రం.. మీరంతా మీ బిడ్డకు సైనికులుగా, స్టార్ క్యాంపెయినర్లుగా మీరే ముందుకు రావాలని కోరుతున్నాడు.
  • చెడిపోయిన వ్యవస్థను మార్చడం కోసం మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం చేస్తున్నాడు.
  • చెడిపోయిన వ్యవస్థ మారాలాంటే మీ బిడ్డ ఒక్కడే ఈ పని చేయలేడు. దేవుడి దయ ఉండాలి, మీ చల్లని ఆశీస్సులు ఉంటేనే మీ బిడ్డ వ్యవస్థను మార్చగలుగుతాడు
  • దేవుడి చల్లని దీవెనలు, మీ ఆశీస్సులు ఎప్పుడూ మీ బిడ్డ ప్రభుత్వం మీద ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ బటన్ నొక్కే కార్యక్రమానికి నాంది పలుకుతున్నా.

Advertisement

తప్పక చదవండి

Advertisement