మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ | CM YS Jagan Inaugurates YSR Statue In Vijayawada | Sakshi
Sakshi News home page

మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

Sep 2 2019 6:12 PM | Updated on Mar 20 2024 5:25 PM

నగరంలోని పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. పుష్కరాల పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్‌ రూమ్‌ సమీపంలోని మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదే ప్రాంతంలో మహానేత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement