కాస్టింగ్‌ కౌచ్‌పై తమ్మారెడ్డి స్పందన | Tammareddy Bharadwaj Respond On Casting Couch In Tollywood | Sakshi
Sakshi News home page

కాస్టింగ్‌ కౌచ్‌పై తమ్మారెడ్డి స్పందన

Apr 19 2018 10:42 AM | Updated on Mar 21 2024 11:25 AM

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని సినీ దర్శక, నిర్మాత తమ‍్మారెడ్డి భరద్వాజ మరోసారి స్పష్టం చేశారు. తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, అయితే తెలుగు ప్రజలకు మంచి జరగాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ గురువారం  విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. హోదా ఉద్యమానికి తెలుగు చిత్రసీమ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం ఎందుకు స్పందించదని  తమ్మారెడ్డి సూటిగా ప్రశ్నించారు.

ఇంత ఉద్యమం జరుగుతున్నా హోదా ఇవ్వడంపై కేంద్రం ఎందుకు వెనకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. నేతలు పరస్పరం విమర్శలు చేసుకోవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. రాష్ట్రానికి నిధులు ఉత్తపుణ్యానికి ఇస్తున్నట్లు బీజేపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. అలాగే కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటనతో పాటుగా తెలుగు సినీ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌, తాజా పరిణామాలపై కూడా తమ్మారెడ్డి స్పందించారు.

Advertisement
 
Advertisement
Advertisement