షూటింగ్‌లో గాయపడ్డ హీరో
తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హందీ రీమేక్ ‘కబీర్ సింగ్’తో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సూపర్ హిట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో మరో తెలుగు హిట్ సినిమా ‘జెర్సీ’ రీమేక్‌కు ఓకే చెప్పాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తెలుగు మాతృకకు దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరియే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్, దిల్ రాజు, అమన్ గిల్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. ఇక సినిమా షూటింగ్‌లో భాగంగా శుక్రవారం ఛంఢీగఢ్‌లోని మొహాలీ స్టేడియంలో షాహిద్ కపూర్ క్రికెట్ సాధన చేస్తున్నాడు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి