డిజిటిల్ మీడియంకు సెన్సార్ నిబంధనలు వర్తించకపోవటంతో లఘు చిత్రాలు తరుచూ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి ప్రేమకథగా తెరకెక్కిన ఓ లఘు చిత్రం తమ మనోభావాలను కించపరిచే విధంగా ఉందంటూ పలు బ్రాహ‍్మణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ‘బ్రాహ్మణ సమాజాన్ని కించపరచే విధంగా లవ్ జీహాద్ ను ప్రేరేపించే విధంగా నిర్మిస్తున్న ‘బ్రాహ్మణుల అమ్మాయి నవాబుల అబ్బాయి’ లఘు చిత్రాన్ని విడుదల కాకుండా ఆపాలని...సినిమా ట్రయిలర్‌ను యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోరుతున్నారు.