సుబ్బరాజుకు జపాన్‌ అభిమానులు ఫిదా

భారతీయ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పిన బాహుబలికి.. భారత్‌లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. అందులోని నటీ నటులకు కూడా అదే స్థాయిలో గుర్తింపు లభించింది. బాహుబలి 2లో కుమారవర్మ పాత్ర పోషించిన సుబ్బరాజుకు జపాన్‌ అభిమానులు ఫిదా అయిన సంగతి తెలిసిందే. సుబ్బరాజు పాత్ర వారిని విపరీతంగా ఆకట్టుకుంది. ఆయన కోసం సోషల్‌ మీడియాలో సైతం విపరీతమైన చర్చ నడించింది. ఇటీవల జపాన్‌ వెళ్లిన సుబ్బరాజ్‌కు అక్కడి అభిమానులు జేజేలు పలికారు. సుబ్బరాజు కూడా కుమార వర్మ వేషంలోనే బహుబలి 2 స్పెషల్‌ స్క్రీనింగ్‌కు వెళ్లి సందడి చేశారు.

మరిన్ని వీడియోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top