పరామర్శ యాత్రలో భాగంగా వైఎస్ షర్మిల గురువారం వికారాబాద్ నియోజకవర్గం నుంచి పర్యటించనున్నారు. * ఉదయం తాండూరు నుంచి బయలుదేరి నేరుగా మర్పల్లి మండలానికి చేరుకుంటారు. అక్కడ కమ్మరి నారాయణ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. * అక్కడ నుంచి మోమిన్పేటకు చేరుకుని అరిగె యాదయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. *చివరగా మోమిన్పేట మండలం ఎన్కతలలోని ఆలంపల్లి వెంకటేశం కుటుంబాన్ని కలుసుకుంటారు. అనంతరం లోటస్పాండ్కు పయనమవుతారు. కాగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్తను జీర్ణించుకోలేక రంగారెడ్డి జిల్లాలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ షర్మిల గత నెల 29 నుంచి మలివిడత యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే.