ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవినీతిని పెంచిపోషిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారధి ఆరోపించారు. చంద్రబాబుకు సింగపూర్పై అంత ప్రేమ ఎందుకని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే సింగపూర్లోని ఆయన ఆస్తులు, లావాదేవీలపై సీబీఐతో గానీ ఎస్ఎఫ్ఐఓతో గానీ విచారణకు సిద్ధపడాలని పార్థసారథి సవాల్ విసిరారు.