ప్రధానిగా నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టాక ప్రవేశపెట్టే తొలి రైల్వే బడ్జెట్ పై వైఎస్సార్ సీపీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ఎంపీలు ముందుగా రైల్వే మంత్రి సదానంద గౌడను కలిసి బడ్జెట్ పై ప్రతిపాదనలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్ సీపీ నేతలు.. 'సదానంద గౌడను కలిసి ప్రతిపాదనలు ఇచ్చాం. నడికుడి- శ్రీకాళహస్తి మార్గం అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంది. ఇది మూడు నియోజకవర్గాల మీదుగా వెళ్తుంది. చాలా దూరం కలిసి వస్తుంది. ఇది చాలా ఎకనామికల్ ప్రాజెక్టు. దీన్ని 10-11 బడ్జట్లో పాస్ చేశారు. రాష్ట్రప్రభుత్వం కూడా ఖర్చు భరిస్తామంది.కడప-బెంగళూరు, గుంటూరు-సికింద్రాబాద్ రైల్వే డబ్లింగ్ పనులు చేపట్టాలి. మన రాష్ట్రం నుంచి రైల్వే కేబినెట్ మంత్రి ఎవరూ లేరు. బీహార్, బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాల నుంచి మంత్రులు ఉండటంతో వాళ్లను బాగా అభివృద్ధి చేసుకున్నారు.మనకి చాలా అన్యాయం జరిగింది. ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరాం. సదానందగౌడ, ఎన్డీయే ప్రభుత్వం ఎలా చేస్తుందో చూద్దాం'అని తెలిపారు.