బడ్జెట్పై ప్రముఖుల స్పందన | political parties reaction on budget 2014 | Sakshi
Sakshi News home page

Jul 10 2014 7:08 PM | Updated on Mar 22 2024 11:21 AM

లోక్సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014 -2015)పై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు బాగుందంటే, మరికొందరు తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. జైట్లీ బడ్జెట్‌ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ విమర్శించారు. ధరల భారం నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించిన సామాన్యుడి ఆశలను బడ్జెట్ అడియాశలు చేసిందని ఆయన ఆరోపించారు. కీలకమైన రంగాల్లో విదేశీ పెట్టుబడులకు అనుమతించడాన్ని జెడియు తప్పుబట్టింది. జైట్లీ బడ్జెట్‌ సామాన్యలకు కోతలు, సంపన్నులకు వరాలిచ్చిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. బడ్జెట్‌లో ఏపీకు కాస్తా న్యాయం జరిగిందని, ఇంకా న్యాయం జరగాల్సి ఉందని వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆశ ఉందని ఆమె అన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యం, సంపదలు వృద్ధిచెందాలని బడ్జెట్‌ కోరుకుంటోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అన్నిరంగాలు పునరుజ్జీవం చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement