సమ్యైక్య శంఖరావం బహిరంగ సభ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు శనివారం ఉదయం కాచిగూడ స్టేషన్కు చేరుకుంది. అలాగే ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఒంగోలు నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు ఈ రోజు ఉదయం నాంపల్లి స్టేషన్ చేరుకుంది. చిత్తూరు, ప్రకాశం జిల్లాల నుంచి సమైక్య శంఖారావం సభలో పాల్గొనేందుకు సమైక్యవాదులు భారీగా ఆ రైళ్లలో తరలివచ్చారు. అయితే ఆ సభ కోసం విశాఖపట్నం నుంచి బయలుదేరాల్సిన ప్రత్యేక రైలును భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. అంతేకాకుండా భారీ వర్షాలతో రైల్వే ట్రాక్లపైకి భారీగా వచ్చి నీరు చేరడంతో గంటల కొద్దీ ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైల్వే స్టేషన్లలో హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. హెల్ప్ లైన్ నెంబర్లు :నల్గొండ :0868-2224392, మిర్యాలగూడ: 08689-242627, నడికుడి: 08649-257625, గుంటూరు: 0863-2222014, పిడుగురాళ్ల-08649-252255.
Oct 26 2013 7:17 AM | Updated on Mar 21 2024 6:35 PM
Advertisement
Advertisement
Advertisement
