వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం భూపేంద్రసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విశాఖ మర్రిపాలెంలోని 104 ఏరియాలోని ఆయన నివాసానికి విచ్చేసిన వైఎస్ జగన్ ...ఘటనపై కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపేంద్రసింగ్ కుమారుడితో వైఎస్ జగన్ మాట్లాడి, ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని సూచించారు.