వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రాఖీ కట్టేందుకు చంచల్‌గూడ జైలు వద్ద మహిళలు బారులు తీరారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు. తమకు అనుమతి ఇచ్చేవరకు కదిలేదిలేదని అక్కడే భీష్కించుకు కూర్చున్నారు. జగనన్నకు రాఖీ కడతామని తాము రెండు రోజుల ముందే జైలు అధికారులకు చెప్పినట్లు వారు తెలిపారు. తమని అడ్డుకుంటున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు జైలు గేటు ఎదురుగా జగన్ ఫోటోకు రాఖీ కట్టారు. మరికొందరు మహిళలు జగన్ను కలవడానికి వచ్చిన ఆయన సతీమణి భారతి చేతికి రాఖీలు కట్టారు.
Aug 21 2013 11:13 AM | Updated on Mar 21 2024 6:46 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement