డిసెంబర్ 16 వరకు పార్లమెంట్ | Winter Session of Parliament to begin on Nov 16 | Sakshi
Sakshi News home page

Oct 20 2016 7:01 AM | Updated on Mar 21 2024 8:56 PM

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 16 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు నెల రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 16న ముగియనున్నాయి.ఈ నేపథ్యంలో శీతాకాల సమావేశాల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సెక్రెటరీ జనరల్ షంషేర్ కె షరీఫ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రస్తుత సమావేశాలు 16వ లోక్‌సభలో 10వ సెషన్ కాగా.. రాజ్యసభకు 241వ సెషన్ కావడం గమనార్హం. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడు లేదా నాలుగో వారంలో ప్రారంభమవుతాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement