విశాఖ కేంద్రంగా విశాఖ, గుంతకల్, గుంటూరులతో కూడిన రైల్వేజోన్‌ను సాధించేవరకూ తమ పోరాటం ఆగదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యు డు విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఈనెల 30 నుంచి చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ గాజువాకలో శుక్రవారం నిర్వహించిన పాదయాత్రను విజయసాయిరెడ్డి ప్రారంభించారు.