తమిళనాడులోని తాజా రాజకీయ పరిణామాలు తనను బాధిస్తున్నాయని ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. తమిళనాట నెలకొన్న తాజా రాజకీయ సంక్షోభంపై ఆమె శనివారం స్పందించారు. అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం సమసిపోవాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తాను వ్యక్తిగతంగా అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళకు మద్దతునిస్తానని ఆమె పేర్కొన్నారు.