ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి (అక్టోబర్ 7) గుంటూరులోని నల్లపాడులో జరగనున్న దీక్షలో పాల్గొని వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు గుంటూరుకు పయనమవుతున్నారు.