జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఇందుకోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని విన్నవించారు. ఢిల్లీలో గురువారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో పన్నీరు సెల్వం కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జల్లికట్టు నిర్వహణ కోసం తమిళనాడులో ఆందోళనలు తీవ్రమైన నేపథ్యంలో ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. ఇటీవల పన్నీరు సెల్వం ఇదే విషయంపై ప్రధానికి లేఖ రాశారు.