కృష్ణాజిల్లా బందరు మండలం కుమ్మరిపాలెంలో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణ నిమిత్తం భూసేకరణకు వచ్చిన ప్రభుత్వాధికారులను స్థానికులు అడ్డుకున్నారు. అక్రమంగా నిర్మించిన పేదల ఇళ్లను కూల్చివేయడానికి ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడంతో స్థానికులు ప్రతిఘటించారు.